: బిందు బాగా అలిసిపోయింది... నిద్ర కూడా పోలేదంటున్న పరిణీతి చోప్రా


వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా...టాప్ హీరోలతో నటించే అవకాశాలు రావాలంటే స్లిమ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇటీవల బాగా సన్నబడింది. విరామం తరువాత ఆయుష్మాన్ ఖురానా సరసన 'మేరీ ప్యారీ బిందు' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షెడ్యూల్ లో పాల్గొంటున్న నటీనటులు తాజాగా 25 గంటలపాటు నిర్విరామంగా షూట్ లో పాల్గొన్నారట. దీనిపై ట్వీట్ చేసిన పరిణీతి...'25 గంటలుగా షూటింగ్ జరిగింది. బిందు చాలా అలసిపోయింది...కనీసం నిద్ర కూడా పోలేదు' అంటూ తనపై తానే జాలిపడిపోయింది. ఈ సినిమాలో చిత్రీకరించిన ఓ సన్నివేశానికి సంబంధించిన ఫోటోను కూడా పోస్టు చేసింది. దీనికి అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

  • Loading...

More Telugu News