: సరబ్ జిత్ పై దాడి ఘటనలో ఇద్దరిపై కేసు
భారత ఖైదీ సరబ్ జిత్ సింగ్ పై దాడి ఘటనలో ఇద్దరు పాక్ ఖైదీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోట్ లఖ్ పత్ జైలు అధికారి ఫిర్యాదు మేరకు హత్యానేరం కింద అమీర్ అఫ్తాబ్, ముదాసర్ అనే ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాక్ లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న సరబ్ జిత్ పై లాహోర్ ఉన్న కోట్ లఖ్ పత్ జైల్లో తోటి ఖైదీలు నిన్న దాడి చేశారు. ఈ సమయంలో తీవ్ర గాయాల పాలైన సరబ్ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు.