: కోచింగ్ సెంటర్ కు షాక్ ఇచ్చిన విద్యార్ధిని!


ముంబైలోని ఒక విద్యార్థిని కోచింగ్ సెంటర్ కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. అభివర్మ అనే బాలిక 2013లో హెచ్ఎస్సీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయింది. ఈ సందర్భంగా మ్యాథ్స్, కెమిస్ట్రీ ట్యూషన్ పెట్టించుకోవాలని అంధేరీలోని ఆక్స్ ఫర్డ్ ట్యూటర్స్ అకాడమీకి వెళ్లింది. దీంతో బాలికకు అత్యధిక మార్కులు తెచ్చేలా చేసే బాధ్యత తమదని భరోసా ఇచ్చి, ట్యూటర్ ను పంపిస్తామని ఫీజులు కట్టించుకున్నారు. మ్యాథ్స్ టీచర్ ను పంపినా అమెకి ఇంగ్లీష్ రాదు. కెమిస్ట్రీకి టీచర్ ను పంపలేదు. దీంతో బాలిక సంఘర్షణకు గురైంది. బాలిక తల్లి ఎన్నోసార్లు ట్యూషన్ సెంటర్ కి ఫిర్యాదు చేయడంతో చివరికి కెమిస్ట్రీ టీచర్ ను పంపారు. పరీక్షలు అయిపోయాయి. బాలికకు తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో కళాశాలలో సీటురావడం కూడా గగనమైపోయింది. దీంతో బాలిక వినియోగదారులు ఫోరమ్ ను ఆశ్రయించింది. తమను ట్యూటర్స్ మోసం చేశారని పేర్కొంది. ఆమె ఫిర్యాదు స్వీకరించి విచారించిన వినియోగదారుల ఫోరమ్...ట్యూషన్ సెంటర్ తప్పు చేసిందని, బాలిక భవిష్యత్ తో ఆడుకుందని నిర్ధారించి, ట్యూషన్ ఫీజు 54,000 రూపాయలు, ఆమెను మానసికంగా వేధించినందుకు 3,00,000 రూపాయలు, కోర్టు ఫీజులు 10,000 రూపాయలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బాలిక చదవకపోతే తామేం చేస్తామంటూ ట్యూషన్ సెంటర్ తరపు న్యాయవాది వాదించినా ఫోరం ఆ విషయాన్ని పట్టించుకోలేదు.

  • Loading...

More Telugu News