: ఏపీ సీఎం చంద్రబాబు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు: మాజీ ఎంపీ హర్షకుమార్


నవ్యాంధ్ర రాజధాని పేరిట ఏపీ సీఎం చంద్రబాబు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. బాబు పాలన రాజధానికే పరిమితమా? అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంలో ఏ లొసుగులున్నాయో తెలియడం లేదని, ముందు సింగపూర్ అన్నారు...ఇప్పుడు జపాన్ అంటున్నారని విమర్శించారు. ఈమేరకు చంద్రబాబుకు ఆయన ఒక లేఖ రాశారు. విదేశీ టూర్ల పేరిట ప్రజాధనాన్ని చంద్రబాబు వృథా చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బాబు విస్మరించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చంద్రన్న పేరు పెట్టుకోవడం సిగ్గు చేటని హర్షకుమార్ తన లేఖలో మండిపడ్డారు.

  • Loading...

More Telugu News