: రాజన్ కొనసాగింపుపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోదీ
ఆర్బీఐ గవర్నరుగా తిరిగి కొనసాగించాలా? వద్దా? అన్న విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. రాజన్ పై ప్రభుత్వ నిర్ణయం ఏంటన్న ప్రశ్న ఆయన ముందు ఉంచగా, ఇది పరిపాలనకు సంబంధించిన అంశమని తెలిపారు. మీడియాకు అంతగా ఆసక్తి అనవసరమని అనుకుంటున్నట్టు వివరించారు. ఆయనకు ఇంకా సెప్టెంబర్ వరకూ సమయం ఉందని, ఈలోగా ఏదో ఒకటి చేద్దామని అన్నారు. కాగా, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, రాజన్ ను తొలగించాలని గట్టిగా పట్టుబట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజన్ ఉంటేనే వ్యవస్థకు మంచిదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.