: దీదీ కేబినెట్ లో మాజీ క్రికెటర్!... ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు, సింగర్ కూ చోటు!
పశ్చిమ బెంగాల్ కు వరుసగా రెండో పర్యాయం సీఎంగా పదవీ ప్రమాణం చేసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ... తన కేబినెట్ కూర్పులో ప్రత్యేకత చాటుకున్నారు. భారత మాజీ క్రికెటర్ కు చోటిచ్చిన దీదీ... ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులతో పాటు ఓ ప్రముఖ సింగర్ ను కూడా తన కేబినెట్ లో చేర్చుకున్నారు. 42 మంది మంత్రులతో కూడిన కేబినెట్ లో మొత్తం 17 మంది కొత్త ముఖాలకు మమత చోటిచ్చారు. టీమిండియా జట్టులో గతంలో సభ్యుడిగా కొనసాగిన లక్ష్మీరతన్ శుక్లాను మమత తన కేబినెట్ లో మంత్రిగా చేర్చుకున్నారు. అదే సమయంలో ఐపీఎస్ అధికారులుగా పనిచేసి ఇటీవలే రిటైర్ అయిన అబని జోర్దార్, జేమ్స్ కుజూర్ లతో పాటు ప్రముఖ నేపథ్య గాయకుడిగా పేరు తెచ్చుకున్న ఇంద్రనీల్ సేన్ కు కూడా మమత తన కేబినెట్ లో చోటిచ్చారు.