: నారా లోకేశ్ ప్రకటనకు విరుద్ధ ప్రకటన చేసిన అమిత్ షా!
ఏపీ కోటాకు చెందిన ఓ రాజ్యసభ సీటును తమకివ్వాలంటూ బీజేపీ చేస్తున్న యత్నాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన ప్రకటనకు విరుద్ధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొద్దిసేపటి క్రితం మరో ప్రకటన చేశారు. రెండు రోజుల క్రితం మహానాడుకు బయలుదేరే ముందు హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాట్లాడిన సందర్భంగా... తమను బీజేపీ రాజ్యసభ సీటు కోరలేదని నారా లోకేశ్ చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో అమిత్ షా అందుకు విరుద్ధమైన ప్రకటన చేశారు. ఏపీ కోటాలో తమకు ఓ సీటు కేటాయించాలని ఇప్పటికే టీడీపీని కోరామని చెప్పిన షా... ఈ దిశగా ఇరు పార్టీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇక ఏపీ బీజేపీ శాఖ నూతన అధ్యక్షుడిని వారంలోగా ప్రకటిస్తామని కూడా అమిత్ షా ప్రకటించారు.