: దక్షిణాదిన ఎన్డీయేకి 50 సీట్లు గ్యారంటీ: ఏబీపీ, ఐఎంఆర్బీ సర్వే
నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రమంగా దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకుంటోందని ఏబీపీ న్యూస్, ఐఎంఆర్బీ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయేకి పడనున్న ఓట్ల సంఖ్య 2014తో పోలిస్తే గణనీయంగా పెరగనుందని తెలిపింది. ఆంధ్రా, కర్నాటక రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 50 సీట్లు, 35 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. 2014 ఎన్నికలతో పోలిస్తే యూపీఏకు వచ్చే సీట్లు 62 నుంచి 66కు పెరగవచ్చని అంచనా వేసింది. లెఫ్ట్ పార్టీలకు 14 స్థానాల వరకూ దక్కవచ్చని వెల్లడించింది. ఇప్పటివరకూ దేశానికి ప్రధానులుగా వ్యవహరించిన వారిలో మోదీకి మొదటి స్థానాన్ని, ఆపై ఇందిరాగాంధీకి, అటల్ బిహారీ వాజ్ పాయికి ప్రజలు మద్దతు పలికారని తెలిపింది.