: సిసలైన కార్యకర్త నారా లోకేశ్!... కార్యకర్తగా పేరు నమోదు చేసుకుని ‘మహానాడు’లో అడుగు!


టీడీపీ వార్షిక పండుగ ‘మహానాడు’ సంరంభం తిరుపతిలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఏకబిగిన కొనసాగనున్న ఈ వేడుకకు హాజరయ్యేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండు రోజుల ముందుగానే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్నారు. నిన్న సాయంత్రం మహానాడు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన లోకేశ్... పార్టీ నేతలకు అందించనున్న ఆహార పదార్ధాలను స్వయంగా టేస్ట్ చేశారు. తాజాగా కొద్దిసేపటి క్రితం ప్రాంగణానికి చేరుకున్న లోకేశ్... సాధారణ కార్యకర్తకు మల్లే కౌంటర్ వద్ద తన పేరు నమోదు చేసుకుని ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. వెరసి పార్టీకి అసలు సిసలైన కార్యకర్తనని ఆయన తనకు తాను చాటుకున్నారు.

  • Loading...

More Telugu News