: రాజకీయాలా? సినిమాలా?... కొడుకు భవిష్యత్తును తేల్చలేకపోతున్న విజయకాంత్!


ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట ఘోరంగా ఓడిపోయిన విజయకాంత్, ఇప్పుడు తన కుమారుడు షణ్ముఖ పాండియన్ భవిష్యత్తు విషయమై ఏం చేయాలో తోచక మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. తండ్రి వారసుడిగా పాండియన్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని, ఇప్పటికే ఎందరో నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చేశారని, డీఎండీకే జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు విజయకాంత్ పై ఒత్తిడి పెంచుతున్నారు. ఎన్నికలకు ముందే పాండియన్ ను రాజకీయాల్లోకి దించి వుంటే ఓటు బ్యాంకు మరింతగా పెరిగేదని వారు అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఇప్పటికైనా పాండియన్ ను ముందు నిలపాలని, దీనివల్ల త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో లాభం పొందవచ్చని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇదే సమయంలో, ఇప్పటికే 'సగాబ్దం' పేరుతో ఓ చిత్రంతో హీరోగా తెరప్రవేశం చేసిన పాండియన్, ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తే, సినీ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆలోచన కూడా విజయకాంత్ మదిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పాండియన్ కెరీర్ లో లాభనష్టాలను పరిశీలించి నిర్ణయం తీసుకునే బాధ్యతను తన బావమరిది ఎల్కే సుదీష్ కు విజయకాంత్ అప్పగించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News