: ఇక దీదీ వంతు!... బెంగాల్ సీఎంగా రెండో దఫా సీఎంగా మమత ప్రమాణం నేడే!


దేశ రాజకీయాల్లో మహిళా నేతలు సత్తా చాటుతున్నారు. మూడు దశాబ్దాల తర్వాత తమిళ నాట వరుసగా రెండో పర్యాయం సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చరిత్ర సృష్టిస్తే... ఐదేళ్ల క్రితం వామపక్షాల కంచుకోటను బద్దలుకొట్టిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా మొన్నటి ఎన్నికల్లో మరోమారు వామపక్షాలను గట్టి దెబ్బ కొట్టిన దీదీ... నేడు వరుసగా రెండో దఫా బెంగాల్ సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు. వామపక్షాల బలాన్ని మరింతగా తగ్గించిన దీదీ... నేడు కోల్ కతాలో జరగనున్న కార్యక్రమంలో బెంగాల్ సీఎం పీఠం ఎక్కనున్నారు.

  • Loading...

More Telugu News