: అగ్రిగోల్డ్ మోసం ఎఫెక్ట్!... డిపాజిటర్ల ఒత్తిడి తట్టుకోలేక బెంగళూరులో ఏజెంట్ ఆత్మహత్య


ఏపీతో మొదలుపెట్టి పలు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మందిని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ నయా మోసం జనం ప్రాణాలను హరిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, అసోం... తదితర రాష్ట్రాలకు చెందిన లక్షలాది మధ్య తరగతి కుటుంబాలకు అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్... మెచ్యూరిటీ తీరిన డిపాజిట్లకు సొమ్ము చెల్లించడంలో విఫలమైంది. డిపాజిటర్ల సొమ్మును సొంతానికి వాడుకున్న ఆ సంస్థ యాజమాన్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ మాయమాటలను నమ్మి పెద్ద సంఖ్యలో డిపాజిటర్ల చేత డబ్బులు కట్టించిన ఏజెంట్లు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. బెంగళూరుకు చెందిన మోహన్ కుమార్ అనే ఏజెంట్ ఏకంగా రూ.80 లక్షల మేర డిపాజిట్ చేయించారు. సంస్థ చేసిన మోసంతో డిపాజిటర్లు మోహన్ కుమార్ పై తీవ్ర ఒత్తిడి చేశారు. ఈ ఒత్తిడిని భరించలేక నిన్న రాత్రి మోహన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు.

  • Loading...

More Telugu News