: సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలపై మండిపడ్డ అరుణ్ జైట్లీ
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని, దాని కారణంగానే సుబ్రహ్మణ్యస్వామి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ స్పందించారు. వ్యక్తిగత విమర్శలను తాను స్వాగతించనని అన్నారు. రాజన్ విషయంలోనే కాదని, ఎవరి విషయంలోనైనా ఇది వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఆర్బీఐ దేశంలో చాలా కీలకమైన విభాగమని, దాని నిర్ణయాలు స్వాగతించడం లేదా తోసివేయడం జరగదని ఆయన తెలిపారు. దానిమీద చర్చే అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్బీఐలోని వ్యక్తి విషయాలను ఇలా బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆయన తెలిపారు.