: ఆర్సీఐ ఏజెన్సీ 10 కోట్ల మాయం కేసులో ఆరుగురు అరెస్టు


సికింద్రాబాదులోని ఆర్సీఐ ఏజెన్సీలో పనిచేసిన ఆరుగురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాదు తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్సీఐ ఏజెన్సీ ఏటీఎంలలో డబ్బులు నింపుతుంది. ఇందులో పని చేసే సిబ్బంది ఏటీఎంలలో డబ్బులు నింపకుండా చేతివాటం చూపారంటూ సిబ్బందిపై ఆర్సీఐ ఏజెన్సీ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కార్లు, కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాగా, వివిధ ఏటీఎంలలో నింపాల్సిన 9 కోట్ల 98 లక్షల రూపాయలను వారు కాజేశారని సమాచారం.

  • Loading...

More Telugu News