: నా మణికట్టుకు దెబ్బ తగిలింది: హీరో రానా
‘బాహుబలి-2’ చిత్రం షూటింగ్ లో హీరో రానా గాయపడ్డాడు. దీంతో, అతని మణికట్టుకు గాయమైంది. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ‘గాయపడ్డ నా మణికట్టుకు బ్యాండేజ్ వేశాము. త్వరలోనే కోలుకుని పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుంటాను’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రానా పోస్ట్ చేశాడు. కాగా, చలన చిత్ర రంగంలో ‘బాహుబలి’ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘బాహుబలి-2’ పై కూడా అభిమానుల అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. 2017 వేసవి నాటికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.