: ‘భారత్ మాతాకీ జై’ నినాదంతో ఎన్డీఏ ‘విజయోత్సవ సభ’ ప్రారంభం
నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్(ఎన్డీఏ) భారత్‌లో అధికారంలోకి వచ్చి నేటికి రెండేళ్లు నిండుతోన్న సందర్భంగా ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌లోని పహరాన్ పూర్‌లో విజయోత్సవ సభ ప్రారంభమైంది. భారత్ మాతా కీ జై నినాదంతో సభను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 198 నగరాల్లో ఎన్డీఏ రెండేళ్ల పాలన విజయోత్సవ సభలు నిర్వహించనున్నారు. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సభను ఆ రాష్ట్రంలోనే ప్రారంభించారు. రెండేళ్ల పాలనను ఎంతో పారదర్శకంగా అందించామని బీజేపీ నేతలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.