: హెచ్‌సీయూలో రాత్రికి రాత్రి ప్రత్యక్షమైన శివలింగం, నంది, నాగ ప్రతిమ
వివాదాలు చెలరేగి ప్రముఖ రాజకీయ నాయకుల పర్యటనలకు వేదికగా నిలిచిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఉన్నట్టుండి శివలింగం, నంది, నాగ దేవత విగ్రహం కనపడడం కలకలం రేపుతోంది. దీనిపై పలువురు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లౌకికత్వాన్ని చాటేలా ఉండాల్సిన వర్సిటీ ఆవరణలో దేవుని విగ్రహాలేంటంటున్నారు. ఒక మతానికి సంబంధించిన భావజాలాన్ని వేరొకరిపై రుద్దడం భావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు అంగీకరించలేదని, అటువంటిది ఒక మతానికి సంబంధించిన విగ్రహాలు రాత్రికి రాత్రే ప్రత్యక్షం కావడమేంటని ప్రశ్నిస్తున్నారు.