: మీరు చేసిన సర్వే ఇప్పటివరకు దేశంలో ఎక్కడా చేయలేదు: తెలంగాణ సర్కార్‌కి లిమ్కా బుక్ కితాబు
తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కేసింది. 19 ఆగస్టు 2014న తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు 4లక్షల మంది ఉద్యోగుల సాయంతో 1.09కోట్ల కుటుంబాలను సర్వే చేసింది. దీంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో ఈ సర్వేను ఎక్కిస్తున్నట్లు నిర్వాహకులు ఈరోజు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్ ను పంపించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు దేశంలో ఇలాంటి సర్వే జరగలేదని లిమ్కాబుక్ నిర్వాహకులు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.