: కాంగోలో భారతీయులపై దాడులు చేస్తున్న స్థానికులు!


ఢిల్లీలో చదువుకుంటున్న కాంగో విద్యార్థిపై దాడి చేసి హత్య చేసిన ఘటన ఆ దేశంలోని ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించగా, అక్కడున్న భారతీయుల షాపులపై దాడులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని కొద్ది సేపటి క్రితం విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇండియాలో ఓ దురదృష్టకర ఘటన జరిగిందని, దీన్ని సాకుగా తీసుకున్న కాంగో అల్లరిమూకలు, ఇండియన్లు నడుపుతున్న షాపులపై యథేచ్ఛగా లూటీలకు దిగి దాడులు చేస్తున్నారని పేర్కొంది. తక్షణం అక్కడి పాలకులు స్పందించి, భారతీయులకు రక్షణ కల్పించాలని కోరింది. కాంగోలో భారతీయులపై జరుగుతున్న దాడుల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News