: దొంగ సర్టిఫికెట్లతో ప్రధాని, కేంద్రమంత్రులు పదవుల్లో కొనసాగుతున్నారు: రఘువీరా


దేశంలో ఎన్డీఏ ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండేళ్లు గ‌డుస్తోన్న సంద‌ర్భంగా కేంద్రం చేస్తోన్న ప్రచార ఆర్భాటాలపై ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ పాల‌న‌లో ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు, చ‌ట్టాలు వ‌చ్చాయ‌ని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్ తెచ్చిన చ‌ట్టాల‌ను బీజేపీ నేత‌లు కాల‌రాస్తున్నార‌ని ఆరోపించారు. రెండేళ్ల పాల‌న‌లో బీజేపీ చేసిన అభివృద్ధి ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని, కేంద్ర‌మంత్రులు దొంగ స‌ర్టిఫికెట్ల‌తో ప‌ద‌వుల్లో కొన‌సాగుతున్నారని ర‌ఘువీరా ఎద్దేవా చేశారు. రెండేళ్ల పాల‌న‌లో బీజేపీ నేత‌లు ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News