: చాలా కాలానికి వర్మకు ఓ పెద్ద హిట్ వచ్చేసినట్టే... 'వీరప్పన్'కు విమర్శకుల ప్రశంసలు!


రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'వీరప్పన్'కు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఏ చిత్రాన్నీ ఓ పట్టాన మెచ్చుకోని బాలీవుడ్ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ సైతం ఇది అద్భుత చిత్రమని ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో లిసా రాయ్ తప్ప మిగతా అందరూ అద్భుత నటన కనబరిచారని రిపోర్టులు వస్తున్నాయని, తాను నేడే చిత్రాన్ని చూస్తానని అన్నారు. ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ స్పందిస్తూ, రాంగోపాల్ వర్మ తిరిగి మంచి ఫాంలోకి వచ్చాడని, వీరప్పన్ గా సందీప్ భరద్వాజ్ సూపర్బ్ గా నటించాడని కొనియాడాడు. నేడు వెండితెరను తాకిన చిత్రానికి వస్తున్న సమీక్షలను చూస్తుంటే, చాలా కాలానికి వర్మకో పెద్ద హిట్ తగిలినట్టే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News