: గాంధీ ఆసుప‌త్రిలో లిఫ్ట్ బాయ్‌పై దాడి.. లిఫ్ట్ సేవ‌లు బంద్.. రోగుల అవ‌స్థ‌లు


సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిలో లిఫ్ట్ సేవ‌లు నిలిచిపోయాయి. ఈరోజు ఉద‌యం లిఫ్ట్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో లిఫ్ట్ ఆప‌రేట్ చేసే బాయ్‌తో రోగుల బంధువులు గొడ‌వ పెట్టుకున్నారు. అంతేకాదు, లిఫ్ట్ బాయ్‌పై చేయిచేసుకున్నారు. దీంతో ఆగ్ర‌హం తెచ్చుకున్న‌ అక్క‌డి సిబ్బంది లిఫ్ట్ సేవ‌ల‌ను పూర్తిగా నిలిపివేశారు. రోగుల‌కు క్యాంటీన్ నుంచి ఆహారం అందించాలంటే లిఫ్ట్ ద్వారానే వారికి చేరాలి. దీంతో రోగులు ఆహారం అంద‌క ఇబ్బందులు ప‌డుతున్నారు. మెట్ల మార్గం ద్వారా రోగుల బంధువులు వారికి ఆహారాన్ని అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News