: లారీ డ్రైవర్ గొంతులో గుచ్చుకుపోయిన చెట్టుకొమ్మ


నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం కారణంగా దారుణం జరిగింది. ఈరోజు నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఒక లారీపై మర్రిచెట్టు బిచ్కుంద మండలం పస్లాపూర్ వద్ద రోడ్డుపై ఉన్న మర్రి చెట్టు విరిగిపడింది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ గోపాల్ గొంతులోకి చెట్టుకొమ్మ గుచ్చుకుపోయింది. అయితే, అతనికి సహాయం చేసేందుకు ఎవరూ కూడా అక్కడి లేని పరిస్థితి. దీంతో, గాయపడ్డ గోపాలే స్వయంగా లారీ నడుపుకుంటూ భాన్సువాడ ఆసుపత్రికి వచ్చి చేరాడు. వెంటనే, స్పందించిన వైద్యులు చికిత్స అందించి అతని గొంతులో ఇరుక్కుపోయిన చెట్టు కొమ్మను తొలగించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, గోపాల్ కు ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. ప్రస్తుతం, ఆసుపత్రిలోనే గోపాల్ చికిత్స పొందుతున్నాడని వైద్యులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News