: ఒబేసిటీతో బాధపడుతున్నారా?...బెలూన్ చికిత్సే బెటర్!
స్ధూలకాయంతో బాధపడుతున్నారా? డైటింగ్, వ్యాయామం తదితరాలు ఏం చేసినా ఫలితం కనబడడం లేదా? అయితే బెలూన్ ట్రీట్ మెంట్ ట్రై చేయండని నిపుణులు చెబుతున్నారు. దీనిపై వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేయగా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 640 మిలియన్లకు పైగా ప్రజలు స్ధూలకాయంతో భాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చని తెలిపారు. ఆహార నియంత్రణ, వ్యాయామంతో శరీర బరువులో కేవలం 3.59 శాతం మాత్రమే తగ్గించుకోగలుగుతున్నారు. దీంతో వ్యాయామం కొనసాగించలేక సతమతమవుతున్నారు. దాంతో మధ్యలోనే బరువు నియంత్రణ చర్యలు ఆపేస్తున్నారు. ఇలాంటి వారందరికీ బెలూన్ చికిత్స బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. పొట్టలో గ్యాస్ నింపబడిన ఒబలాన్ బెలూన్ వాడుతున్న స్ధూలకాయుల్లో 6.81 శాతంగా వెయిట్ లాస్ ఉంటోందని వారు చెప్పారు. ఆహార నియమాలు పాటించడం, వ్యాయామాలు చేయడంతో శరీర బరువును నియంత్రించుకోలేని వారు ఒబలాన్ బెలూన్ చికిత్స ద్వారా బరువును తగ్గించుకోవచ్చని వారు సూచించారు.