: ఇస్లాం మతం వద్దు.. ‘మార్క్సిస్ట్‌ నాస్తిక’ వాదమే ముద్దు: చైనా


చైనా ప్రెసిడెంట్ ఝీ జిన్‌పింగ్ నాయ‌క‌త్వంలోని కమ్యూనిస్ట్‌ పార్టీ నుంచి అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఓ హెచ్చ‌రిక రావ‌డం ఆ దేశంలో వివాదానికి తావిస్తోంది. ఇస్లాం మ‌తాన్ని పాటించ‌డం ఆపేయాల‌ని, చైనా స్టేట్ పాల‌సీ అయిన మార్క్సిస్ట్ నాస్తిక విధానాన్నే అనుస‌రించాల‌ని తాజాగా చైనా అధినాయకత్వం ఆదేశాలు ఇచ్చింది. జింజియాంగ్ ప్రొవిన్సులో ఈ సూచ‌న‌ల ప్ర‌భావం అధికంగా క‌నిపించాల‌ని చైనా భావిస్తోంది. ఈ అంశంపై ఝీ జిన్‌పింగ్ ఇటీవ‌ల ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. జింజియాంగ్ ప్రాంతంలో రోజురోజుకీ పెరుగుతోన్న‌ అతివాదం దృశ్యా ఆ ప్రాంతంలో మార్క్సిస్ట్ నాస్తిక భావజాలాన్నే పాటించాలంటూ ఆయ‌న ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అక్కడి విఘర్‌ అతివాద సంస్థ కమ్యూనిస్ట్‌ పార్టీ ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తుండ‌డం, జింజియాంగ్ ప్రాంతంనుంచి త‌మ ప్ర‌భుత్వానికి నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతుండ‌డంతో కమ్యూనిస్ట్‌ పార్టీ నాస్తిక వాదాన్నే పాటించాలంటూ హెచ్చ‌రిక‌లు చేసింది. ఇస్లామిక్ అతివాద భావజాలమంతా పాకిస్థాన్ నుంచే త‌మ దేశానికి వ‌స్తోంద‌ని భావిస్తోన్న చైనా పాక్‌కి కూడా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

  • Loading...

More Telugu News