: మోదీ భారతీయుడా? ప్రవాసుడా?: విరుచుకుపడ్డ శివసేన


ప్రధాని నరేంద్ర మోదీ భారత పౌరుడా? లేక ప్రవాస భారతీయుడా? అన్నది ముందు తేల్చుకోవాలని శివసేన నిప్పులు చెరిగింది. మోదీ తరచూ విదేశీ పర్యటనలు చేస్తుండటాన్ని విమర్శిస్తూ, పార్టీ అధికార పత్రిక సామ్నాలో విరుచుకుపడింది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క చోట మాత్రమే ఆ పార్టీ విజయం సాధించిందని గుర్తు చేస్తూ, మిగతా నాలుగు రాష్ట్రాల్లో కనీస ప్రభావం చూపలేకపోయామన్న విషయాన్ని మరచి, సంబరాలకు ఎలా రెడీ అవుతున్నారని ఎద్దేవా చేసింది. మోదీ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రారంభించినా, అవి క్షేత్ర స్థాయిలో ప్రజలకు దగ్గర కావడం లేదని అంది. ఇక్కడ కట్టాల్సిన పన్ను ఎగ్గొట్టి విదేశాల్లో భారతీయులు దాచుకున్న బ్లాక్ మనీని తిరిగి వెనక్కు తెప్పించడంలోనూ మోదీ సర్కారు విఫలమైందని శివసేన దుయ్యబట్టింది.

  • Loading...

More Telugu News