: శృంగార తార సన్నీ లియోన్ ‘కథలు’ రాసింది


అందాల శృంగార తార సన్నీలియోన్ కథలు రాసింది. అవును... నిజమే, ఆమె రచయిత్రి అవతారమెత్తింది. ‘స్వీట్ డ్రీమ్స్’ పేరుతో రాసిన ఈ పుస్తకంలో మొత్తం 12 కథలున్నాయి. సినిమా షూటింగులో ఉన్నప్పుడు తనకు కలిగే శృంగార భావాలను ఆధారంగా చేసుకుని ఈ కల్పిత కథా సంకలనాన్ని రూపొందించింది. అంతేకాకుండా, ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ నవలను ఇటీవల ఆమె చదివిందట. ఆ నవలలో ఉపయోగించిన శృంగార పదాలు ఆమెకు బాగా నచ్చాయని సమాచారం. మార్కెట్లోకి విడుదలైన ఈ పుస్తకంలోని కథలను రాయడానికి ఆమెకు నాలుగు నెలల సమయం పట్టిందట. కొసమెరుపు ఏమిటంటే, ఆమె రాసిన ఈ పుస్తకాన్ని చదవాలంటే స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లకే సాధ్యమవుతుంట. జగ్గర్ నాట్ బుక్ యాప్స్ లో మాత్రమే ఈ పుస్తకం లభ్యమవుతోంది. ఈ పుస్తకం కొనుగోలు చేయాలంటే, ముందుగా జగ్గర్ నాట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News