: ‘జంపింగ్’ ఎమ్మెల్యే చాంద్ బాషాకు కేబినెట్ పోస్టు?... ‘అనంత’లో జోరందుకున్న ప్రచారం!


వైసీపీ టికెట్ పై అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మైనారిటీ నేత అత్తార్ చాంద్ బాషాకు త్వరలోనే మంత్రి పదవి దక్కనుందట. ఈ మేరకు అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మైనారిటీ వర్గానికి చెందిన అత్తార్ చాంద్ బాషా మొన్నటి ఎన్నికల దాకా టీడీపీలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు కాస్తంత ముందుగా ఆయన టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోయారు. గడచిన ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్ పై చాంద్ బాషా విజయం సాధించారు. అయితే ఇటీవలే 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వారిలో చాంద్ బాషా కూడా ఒకరు. గతంలో టీడీపీలో ఉండగా... మంత్రి పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు నెరపిన చాంద్ బాషా... మైనారిటీ శాఖ మంత్రి పదవి ఇస్తారనే హామీతోనే తిరిగి సొంతగూటికి చేరారని ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News