: 'రానా దగ్గుబాటి' అని రిక్వెస్ట్ వస్తే నమ్మనే నమ్మొద్దంటున్న రానా!
ఫేస్ బుక్ లో తన పేరిట 'రానా దగ్గుబాటి' అనే ఐడీతో తప్పుడు ఖాతా నడుస్తోందని, ఈ ఎకౌంట్ నుంచి ఎటువంటి రిక్వెస్ట్ లు వచ్చినా పట్టించుకోవద్దని రానా కోరాడు. ఫేస్ బుక్ లో ఫేక్ ఎకౌంట్ ఉందని గుర్తించిన ఆయన, ఈ మేరకు తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. "ఓ తప్పుడు ఖాతా నా పేరిట ఎఫ్బీలో చక్కర్లు కొడుతోంది. దయచేసి దాన్నుంచి వచ్చే రిక్వెస్టులు యాడ్ చేసుకోవద్దు. అతి త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది" అని తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. ఫేక్ ఎకౌంట్ ప్రొఫైల్ పిక్చర్ ను సైతం పోస్టు చేశాడు. కాగా, ప్రస్తుతం బాహుబలి - ది కన్ క్లూజన్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న రానా, మరోపక్క 'ఘాజీ' అనే చిత్రాన్నీ చేస్తున్నాడు.