: బీహార్ మాజీ సీఎం మాంఝీ కాన్వాయ్ పై దాడి!... వాహనానికి నిప్పుపెట్టిన బీహారీలు


బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు అనుంగు అనుచరుడిగా కొనసాగిన మాంఝీ... నితీశ్ కరుణతోనే ఆ రాష్ట్రానికి సీఎం అయ్యారు. సీఎం పీఠం ఎక్కగానే నితీశ్ కు వ్యతిరేకంగా మారిపోయిన మాంఝీ పెద్ద కలకలమే రేపారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాంఝీ సొంత కూటమి పెట్టుకుని బీజేపీ మద్దతుతో పోటీ చేసినా కనీసం తాను ఒక్కరు కూడా గెలవలేకపోయారు. తాజాగా నేటి ఉదయం మాంఝీ ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై గుర్తు తెలియని దుండగులు దాడికి దిగారు. బీహార్ లోని దుమారియాలో జరిగిన ఈ డాదిలో అటుగా వెళుతున్న మాంఝీ కాన్వాయ్ పై దుండగులు విరుచుకుపడ్డారు. దుండగులు మాంఝీ కాన్వాయ్ లోని ఓ కారుకు నిప్పు కూడా పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News