: తెలంగాణ ఎంసెట్ ‘అగ్రికల్చర్’ ఫలితాల్లో తొలి ఆరు ర్యాంకర్లందరికీ 160 మార్కులే
తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ‘ఇంజినీరింగ్, అగ్రికల్చర్’ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 77.88శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణ ఎంసెట్ ‘అగ్రికల్చర్’ ఫలితాల్లో అగ్ర స్థానాల్లో నిలిచిన ఆరుగురు ర్యాంకర్లందరికీ 160 మార్కులు వచ్చాయి. విద్యార్థులు బి.ప్రదీప్ రెడ్డి, ఎస్. ప్రత్యూష, ఎమ్. అర్బాజ్, వి.ప్రణతి, ఎ. యజ్ఞప్రియ, జీషన్ అహ్మద్ జలీలి 160 మార్కులతో వరసగా తొలిస్థానాల్లో నిలిచారు. ఫలితాల విడుదల సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాలేజీల్లో తనఖీలు చేపడుతోన్న దృష్ట్యా అడ్మిషన్ల షెడ్యూలు ఇప్పుడే ప్రకటించలేమని, త్వరలోనే దానిపై వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.