: రూ. 5.68 లక్షల ధరలో గ్రాండ్ ఐ10 స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసిన హ్యుందాయ్


సరికొత్త రెడ్ అండ్ బ్లాక్ థీమ్ ఇంటీరియర్లు, 6.2 ఏవీఎస్ (ఆడియో, వీడియో సిస్టమ్)లతో కూడిన గ్రాండ్ ఐ10 స్పెషల్ ఎడిషన్ కారును హ్యుందాయ్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఓ కొరియన్ సంస్థగా, ఇండియాలోకి ప్రవేశించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కారును విడుదల చేస్తున్నామని సంస్థ ప్రకటించింది. పెట్రోలు, డీజిల్ వేరియంట్లలో లభించే వీటి ధరలు ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ. 5,68,606 (పెట్రోలు - సాలిడ్ ఎడిషన్) నుంచి రూ. 6,63,793 (డీజిల్ - మెటాలిక్ ఎడిషన్) మధ్య ఉంటాయని తెలిపింది. కాగా, గ్రాండ్ ఐ10, 2014లో ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోగా, దేశవ్యాప్తంగా 3 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి.

  • Loading...

More Telugu News