: తెలంగాణ ఎంసెట్ ‘ఇంజినీరింగ్’ ఫలితాల్లో తాళ్లూరి సాయితేజకి తొలిర్యాంకు


తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మొత్తం 77.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎంసెట్ ‘ఇంజినీరింగ్’ ఫలితాల్లో 160 మార్కులతో తాళ్లూరి సాయితేజ తొలి ర్యాంకర్ గా నిలిచాడు. రెండో ర్యాంక్ చేతన్ సాయి (159మార్కులు), మూడో ర్యాంక్ నిఖిల్ సామ్రాట్ (158 మార్కులు), నాలుగో ర్యాంక్ విఘ్నేష్ రెడ్డి (158మార్కులు), ఐదో ర్యాంక్ రాహుల్ (158 మార్కులు) సాధించారు. ఇంటర్‌ గ్రూపు సబ్జెక్టుల మార్కులకు 25 శాతం, ఎంసెట్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు ర్యాంకులు కేటాయించారు.

  • Loading...

More Telugu News