: బీసీల ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం.. నేటినుంచి పాదయాత్రలు: ఆర్.కృష్ణయ్య
తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నారు. ఉద్యమాన్ని బీసీ వర్గాల చెంతకు తీసుకెళుతూ నేటి నుంచి పాదయాత్ర, జీపుయాత్రలు చేయనున్నారు. బీసీ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో నేటి నుంచి అన్ని జిల్లాలలో ‘చైతన్య బాట’ పేరిట యాత్రను చేపట్టనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నుంచి చైతన్యబాట ప్రారంభమవుతుందని ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. బీసీ జెండాలను ఆవిష్కరిస్తూ ఆ వర్గాల్లో చైతన్యం తీసుకొస్తామని, బీసీలు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తామని బీసీ సంఘం నేతలు అంటున్నారు.