: 1998లో తను కాపాడిన చిన్నారి... నేడు గ్రాడ్యుయేషన్ తో ముందుకు వస్తే!


అది 1998. అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతంలో ఓ అపార్టుమెంటుకు నిప్పంటుకుంది. సమాచారం అందగానే, మిగతా ఫైర్ ఆఫీసర్లతో కలిసి పీటర్ గెట్జ్ ఆ ప్రాంతానికి వెళ్లాడు. లోపలికి వెళ్లి అగ్నికీలల నుంచి పలువురిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఐదేళ్ల చిన్నారి అపాంటీని రెండు చేతుల్లో ఎత్తుకుని బయటకు పరిగెత్తుతూ వచ్చాడు గెట్జ్. చేతుల్లో అచేతనంగా పడివున్న అపాంటీని ఒడిసిపట్టుకుని, వేగంగా పరిగెడుతున్న గెట్జ్ చిత్రాలు అప్పట్లో అన్ని పత్రికల్లో వచ్చాయి. ఆపాంటీ ఆసుపత్రిలో కోలుకుంది. ఇక కట్ చేస్తే... ఆనాడు అగ్నిప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ అపాంటీ, నేడు తన 23వ ఏట ఈస్ట్రన్ కనెక్టికట్ స్టేట్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేయగా, ఆమెను రక్షించి, ప్రస్తుతం పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్న పీటర్ గెట్జ్ స్వయంగా కాన్వకేషన్ కు హాజరయ్యారు. ఇప్పుడు ఆ పాత, కొత్త చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాను తీసుకున్న శిక్షణలో తనకు ఏమి నేర్పారో, ఆనాడు తాను అదే చేశానని, అది తన ఉద్యోగ ధర్మమని గెట్జ్ వ్యాఖ్యానించారు. "నేను దాదాపుగా చనిపోయాను. కానీ దేవుడు గెట్జ్ రూపంలో వచ్చి రెండో జన్మను నాకు అందించారు" అని అపాంటీ వెల్లడించింది. ఆ రెండు చిత్రాలను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News