: చంద్రబాబును ‘బాస్’గా సంబోధించిన నారా లోకేశ్!


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... తన తండ్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఏమని సంబోధిస్తారు? ఇంటిలో ఏమని పిలుస్తారన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే... బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో ఏమని సంబోధిస్తారన్న విషయాన్ని ఓసారి పరిశీలిస్తే కాస్తంత వైవిధ్యం కనబడుతోంది. ‘పార్టీ అధినేత’గా తన తండ్రిని సంబోధించే లోకేశ్.. కొన్నిసార్లు ‘ఏపీ సీఎం’ అని కూడా ప్రస్తావిస్తారు. అయితే నిన్న హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా లోకేశ్ తన తండ్రిని ‘బాస్’గా అభివర్ణించారు. ఏపీ కోటాలోని రాజ్యసభ సీటును తెలంగాణకు చెందిన పార్టీ నేతలకు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పిన సందర్భంగా ‘‘ఈ విషయాన్ని ‘బాస్’ ఎప్పుడో చెప్పేశారు’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News