: ప్రొఫెసర్లను కేసులో ఇరికించాలని ప్రయత్నించి, తామే ఇరుక్కున్న ఎంటెక్ విద్యార్థులు!


కళాశాల ప్రొఫెసర్లు సతాయిస్తున్నారన్న నెపంతో, వారిని పోలీసు కేసుల్లో ఇరికించాలని చూసిన ఇద్దరు ఎంటెక్ విద్యార్థులు పన్నిన పన్నాగం వారినే కటకటాల వెనక్కు నెట్టేసింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, నగరంలోని ఈస్ట్ వెస్ట్ కాలేజీలో చదువుతున్న రాఘవేంద్ర, హోయ్ సల అనే విద్యార్థులను అక్కడి ప్రొఫెసర్లు ప్రసన్నరాజ్, ధనరాజ్, చందన్ రాజ్ లు ఏడిపిస్తున్నారట. వీరిపై పగ తీర్చుకునేందుకు, వారి పేరిట బెంగళూరు విమానాశ్రయాన్ని పేల్చేస్తామని తప్పుడు ఫోన్ కాల్ చేశారు. ఈ ఘటన మార్చి 9న జరుగగా, అప్పట్లో, బెదిరింపు ఉత్తుత్తిదేనని పోలీసులు తేల్చారు. తాజాగా, ఈ నెల 9వ తేదీన కాలేజీలో టాపర్ గా ఉన్న స్టూడెంట్ పేరిట నకిలీ ఈమెయిల్ ఖాతా తెరిచి, దానిలో ప్రొఫెసర్ల ఫోటోలు ఉంచి బెదిరింపు ఈ-మెయిల్ ను ఎయిర్ పోర్టుకు పంపారు. ఈ-మెయిల్ ను ట్రేస్ చేసుకుంటూ వచ్చిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తమను ఏడిపిస్తున్నందునే ఇలా చేశామని పోలీసుల విచారణలో విద్యార్థులు వెల్లడించడం గమనార్హం.

  • Loading...

More Telugu News