: సొంతూరుకు చేరుకున్న నారా లోకేశ్!... నేటి రాత్రికి చంద్రబాబు కూడా!


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న రాత్రి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్నారు. రేపటి నుంచి తిరుపతిలో టీడీపీ మహానాడు జరగనుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకకు హాజరయ్యేందుకే లోకేశ్ నిన్న రాత్రికే నారావారిపల్లె చేరుకున్నారు. ఇక ఈ వేడుకలకు హాజరయ్యేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా నేటి రాత్రికి అక్కడికి చేరుకోనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో చంద్రబాబుతో పాటు లోకేశ్ కూడా ప్రారంభం నుంచి ముగింపు దాకా పాల్గొంటారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు రాత్రి నారావారిపల్లెలో బస చేయనున్న తండ్రీకొడుకులిద్దరూ తెల్లారగానే తిరుపతి చేరుకుంటారు. మహానాడు ముగిసిన తర్వాతే వారు తిరిగి విజయవాడ చేరుకుంటారు.

  • Loading...

More Telugu News