: స్వార్థంతోనే షిర్డీ సాయిబాబాపై చర్చలు చేస్తున్నారు: స్వామి పరిపూర్ణానంద మండిపాటు
షిర్డీ సాయిబాబా దేవుడా? కాదా? అంటూ చర్చలు, వాదోపవాదాలతో రచ్చ చేస్తున్న వాళ్లపై స్వామి పరిపూర్ణానంద మండిపడ్డారు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రచారం కోసమే వారు ఈవిధంగా చేస్తున్నారని విమర్శించారు. షిర్డీ సాయిబాబాను కొంతమంది దేవుడిగా, మరికొంత మంది గురువుగా ఆరాధిస్తారని అన్నారు. షిర్డీ సాయిబాబా దేవుడు కాదంటూ చేసిన చర్చల కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని స్వామి పరిపూర్ణానంద ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, షిర్డీ సాయిబాబా దేవుడేనంటూ సిద్ధగురు రమణానంద ఇటీవల ఒక సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ సభ వద్దకు పంపా క్షేత్ర పీఠాధిపతి గోవిందాచార్యులు దూసుకువెళ్లడం, అక్కడ రభస జరగడం తెలిసిందే. ఆ తర్వాత ఒక ఛానెల్ వేదికగా చర్చలు జరగడం, వాదోపవాదనలు చోటుచేసుకోవడం కూడా విదితమే.