: హైదరాబాదును మరోసారి అతలాకుతలం చేసిన వర్షం


హైదరాబాదీలు చిత్రవిచిత్రమైన అనుభూతిని చవిచూస్తున్నారు. వాతావ‌ర‌ణం రోజుకో తీరుగా ఉంటోంది. ఇటీవల వ‌ర‌స‌గా రెండు రోజులు కురిసిన వానలతో వీచిన గాలులు హోర్డింగ్ లను కూల్చి భారీ ఆస్తినష్టం కలిగేలా చేసిన సంగతి తెలిసిందే. దాని నుంచి తేరుకోకముందే రెండు రోజులు సూర్యుడి భగభగలతో నగరాన్ని అల్లాడించాడు. నేటి సాయంత్రం చిన్నగా ప్రారంభమైన వర్షం పెద్దగాలిని తోడు తీసుకొచ్చింది. దీంతో మరోసారి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో అంధకారం అలముకుంది. యంత్రాంగం ట్రాఫిక్ క్లియర్ చెయ్యడంలో బిజీగా ఉన్నారు. రోహిణీ కార్తెలో భీకర గాలులతో కురుస్తున్న ఈ అకాలవర్షాల కారణంగా నగరవాసులు పలు ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News