: ‘ఫోర్డ్’ కార్లలో సమస్యలు.. అమెరికాలో రెండున్నర లక్షల కార్లు రీకాల్


అమెరికాలో రెండున్నర లక్షల ఫోర్డ్ కార్లను ఆ సంస్థ రీకాల్ చేసింది. 2013-14 వరకు విడుదల చేసిన ఎఫ్ -150 మోడల్ కార్లలో ఇంధన లీకేజీ, బ్రేక్ లో సమస్యలు తలెత్తడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘ఫోర్డ్’ ప్రతినిధులు పేర్కొన్నారు. రీకాల్ చేసిన కార్లకు ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకుండానే సేవలందిస్తామని తెలిపారు. ఎఫ్-150 మోడల్ కార్లలో ఇంధన లీకేజ్ కారణంగా బ్రేకులు ఫెయిల్ అయ్యే అవకాశముందని తెలిపారు. ఈ మోడల్ కార్లలో బ్రేకులు ఫెయిల్ కావడంతో ఇప్పటి వరకు తొమ్మిది ప్రమాదాలు జరిగాయన్నారు.

  • Loading...

More Telugu News