: హెన్రిక్స్, వార్నర్ ను వరుస బంతుల్లో బలిగొన్న కుల్దీప్ జాదవ్


ఐపీఎల్ సీజన్ 9లో బాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాదు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతోంది. టాస్ గెలిచిన గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకోగా ఆదిలోనే ధావన్ (10) ను మోర్కెల్ అవుట్ చేశాడు. అనంతరం వార్నర్ (28), హెన్రిక్స్ (31) కుదురుకున్నట్టు కనిపించారు. పదో ఓవర్ లో వరుస బంతుల్లో కుల్దీప్ యాదవ్ వారిద్దరినీ పెవిలియన్ కు పంపడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. క్రీజులో యువరాజ్ సింగ్ (20), దీపక్ హుడా (5) ఉన్నారు. యువీ భారీ షాట్లు ఆడుతున్నాడు. 14 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు మూడు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో యాదవ్ రెండు, మోర్కెల్ ఒక వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News