: నిజజీవితంలో బాలకృష్ణ హీరో కాదు: సీపీఐ నేత
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ నిజ జీవితంలో మాత్రం హీరో కాదని అనంతపురం జిల్లా సీపీఐ కార్యదర్శి జగదీష్ ఆరోపించారు. సినిమాల్లో అవినీతిని అంతమొందించే పాత్రలు పోషిస్తున్న బాలయ్య తన నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోతున్నప్పటికీ పట్టించుకోవట్లేదని అన్నారు. అనంతపురం జిల్లాకు ఎంతో ముఖ్యమైన హంద్రీ నీవా ప్రాజెక్టును పూర్తి చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. హంద్రీనీవా జలసాధన కోసం హిందూపురం నుంచి గుంతకల్లు వరకు బస్సు యాత్ర చేపడతామని జగదీష్ పేర్కొన్నారు.