: ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతే వేరు.. రిస్ట్ వాచ్ లా చేతికి చుట్టేసుకోవచ్చు!


రిస్ట్ వాచ్ లా మడిచేయగల ఒక స్మార్ట్ ఫోన్ ను చైనాకు చెందిన మోక్సి గ్రూప్ అనే ఒక కంపెనీ తయారు చేసింది. ఒక చిన్న స్టార్టప్ కంపెనీ అయిన ‘మోక్సి’ ఈ ఫోన్ ను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. రిస్ట్ వాచ్ లా చేతికి చుట్టేసుకున్నప్పటికీ ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుందని సదరు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక ఈ ఫోన్ తయారీకి ఉపయోగించిన మెటీరియల్ గురించి చెప్పాలంటే... ప్రపంచంలోనే అత్యంత సన్నటి బలమైన గ్రాఫీన్ అనే పదార్థాన్ని వినియోగించి ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను తయారు చేయడంతో ఎటువైపుకి పడితే అటువైపుకి ఒంగేలా ఉందని, ఒక మోడల్ ఫోన్ ను తయారు చేశామని ప్రతినిధులు చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి లక్ష ఫోన్లను చైనా మార్కెట్ లో అమ్మకానికి పెట్టాలని చూస్తున్నామని ‘మోక్సి’ పేర్కొంది. అయితే, తొలుత తయారు చేసే ఫోన్లలో బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్లే ఉంటాయని, పూర్తి స్థాయి కలర్ ఫోన్ ను 2018 నాటికి తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది.

  • Loading...

More Telugu News