: వర్మ ఈసారి సల్మాన్, షారూఖ్ ల మీదపడ్డాడు


నిన్నటి వరకు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రజనీకాంత్... ఇలా దక్షిణాది నటులందర్నీ విమర్శించి ఇప్పుడు ముంబై చేరిన వర్మ, తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ మీదపడ్డాడు. కమలహాసన్ చేసిన తప్పునే ఇప్పుడు షారుఖ్ ఖాన్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తమిళనాట మంచి పీక్ లో ఉన్న కమల్ తన స్టార్‌ డమ్‌ ను రజనీ కాంత్‌ కు కోల్పోయినట్టుగానే బాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని షారుఖ్‌, సల్మాన్‌ చేతిలో పెడుతున్నాడని పేర్కొన్నాడు. సల్మాన్‌ బాలీవుడ్ మెగాస్టార్‌ గా అవతరిస్తుంటే, కింగ్‌ ఖాన్‌ మాత్రం సాధారణ 'ఫ్యాన్‌'గా మిగిలిపోతున్నాడని వర్మ బాధపడ్డాడు. 'సుల్తాన్‌' ట్రైలర్‌ పై మాట్లాడుతూ, 'సల్మాన్‌ ఖాన్‌ ఇప్పటికే షారుఖ్‌ కన్నా పెద్ద స్టార్‌ అయ్యాడు. స్టార్‌ డమ్‌ అంటే కలెక్షన్లు మాత్రమే. ఏ స్టార్ హీరో గత మూడు సినిమాలు బిగ్గెస్ట్‌ కలెక్షన్లు రాబడతాయో అతను అతిపెద్ద సూపర్ స్టార్‌ అవుతాడు' అంటూ వర్మ ముక్తాయించాడు.

  • Loading...

More Telugu News