: నటించడం, ధ్యానం చేయడం రెండూ ఒకటే...ఇంట్లోంచి బయటకు వెళ్లబుద్ధి కాదు: రావు రమేష్


సినిమాలో నటించడం అంటే ధ్యానం చేసినంత గొప్పగా ఉంటుందని టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు రావు రమేష్ తెలిపారు. బ్రహ్మోత్సవం సినిమా ప్రమోషన్ లో ఆయన మాట్లాడుతూ, ఓ సినిమా చేస్తున్నప్పుడు వచ్చే కిక్ ను దేనితోనూ కొలవలేమని అన్నారు. ధ్యానం చేస్తున్న వ్యక్తి, మ్యూజిక్ లో లీనమైన విద్వాంసుడు ఎంత తన్మయత్వం చెందుతారో... ఓ పాత్రలో లీనమై నటిస్తే అదే భావం కలుగుతుందని చెప్పారు. ఓ సినిమాకి డబ్బింగ్ చెప్పేసిన తరువాత ఇక దాని గురించి ఆలోచించనని అన్నారు. షూటింగ్ ముగించి ఇంటికి వచ్చాక, పిల్లలు, స్నేహితులతో గడుపుతానని, ఇతర సినీ నటులు చెప్పినట్టు సినిమాలు చూస్తూ గడపనని ఆయన తెలిపారు. షూటింగ్ లేకపోతే ఇంట్లో గడిపేందుకే మొగ్గుచూపుతానని ఆయన చెప్పారు. మహేష్ బాబు అద్భుతమైన నటుడని, దర్శకుడి పనిలో జోక్యం చేసుకోడని ఆయన తెలిపారు. ఆయన ఇచ్చే చిన్న చిన్న సలహాలు చాలా అద్భుతమైన ప్రభావం చూపుతాయని ఆయన చెప్పారు. సినిమాల్లో విజయం సాధించడం, పేరు ప్రతిష్ఠలు సంపాదించుకోవడం పట్ల సంతోషంగా ఉన్నానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News