: రాహుల్ గాంధీ ప్రధాని కాలేరు: గుండా మల్లేష్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే తదుపరి భారత ప్రధాని అని జరుగుతున్న ప్రచారాన్ని సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కొట్టిపారేశారు. రాహుల్ ప్రధాని కావడం కల్ల అని అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో సీపీఐ జాతీయ నేత గుజ్జల యలమందారెడ్డి వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లేష్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆకాశం నుంచి నేలవరకు అవినీతిమయమేనని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 'అమ్మహస్తం' పథకం భస్మాసుర హస్తమని ఆయన విమర్శించారు.