: టీమిండియా క్రికెటర్ నెహ్రాకు విజయవంతంగా శస్త్రచికిత్స
టీమిండియా క్రికెటర్ ఆశిష్ నెహ్రా కుడి మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఈ విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఒక ట్వీట్ చేశారు. ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకు మెంటార్ గా లక్ష్మణ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆశిష్ నెహ్రాకు లండన్ లో గత రాత్రి శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని లక్ష్మణ్ పేర్కొన్నాడు. నెహ్రాకు శస్త్రచికిత్స అనంతరం తీసిన ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.