: కాస్త తక్కువగా తీసుకోండి: 'మందుబాబు'లకు యూపీ సీఎం సూచన


మద్యం తాగే అలవాటు ఉన్నవారు కొంచెం తక్కువగా సేవించాలని ఉత్తరప్రదేశ్ లోని మందుబాబులకు ఆ రాష్ట్ర సీఎం అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్రంలో మాదిరి యూపీలో కూడా సంపూర్ణ మద్య పాన నిషేధం విధించాలంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇటీవల సూచన చేసిన సంగతి తెలిసిందే. ఈ సూచన నేపథ్యంలోనే అఖిలేష్ ఈ విజ్ఞప్తి చేశారు. బీహార్ తరహాలో తమ రాష్ట్రంలో పూర్తిగా మద్యాన్ని నిషేధించడం కుదరదని చెప్పారు. సంపూర్ణ మద్య పాన నిషేధం విధిస్తే కనుక చెరుకు రైతులు, మద్యం షాపుల్లో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆయన అన్నారు. అందుకే, మద్యం తాగే వ్యక్తులు కొంచెం తక్కువ మోతాదులో సేవించాలని అఖిలేష్ సూచించారు.

  • Loading...

More Telugu News