: హైకోర్టు విభజనపై ఉద్యమానికి సిద్ధమవుతున్నాం: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ


హైకోర్టు విభజనపై ఉద్యమానికి సిద్ధమవుతున్నామని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులను అడ్డుకుంటామని చెప్పింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు డైరెక్షన్ లో నడుస్తున్న కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆరోపించింది. తెలంగాణ సమస్యలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు కనిపిస్తున్నాయా? లేవా? అని జేఏసీ ప్రశ్నించింది. ఇప్పటికైనా ఇక్కడి బీజేపీ నేతలు స్పందించకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించింది. హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఏపీకి చెందిన న్యాయమూర్తులను తెలంగాణలో కొనసాగిస్తున్నారని ఆగ్రహించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సమ్మె చేసేందుకు తెలంగాణ న్యాయవాదులు చీఫ్ జస్టిస్ కు లేఖ ఇచ్చినట్లు అడ్వకేట్ జేఏసీ పేర్కొంది. అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా నైనా హైకోర్టు విభజన జరపాలని డిమాండ్ చేసింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మరో ముప్ఫై ఏళ్లు కొనసాగించడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని అడ్వకేట్ జేఏసీ ఆరోపించింది.

  • Loading...

More Telugu News